Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దివ్య దేవరాజన్‌కు ముత్తినేని ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంధురాలు దిడిగిద్ద శ్రీలతపై అక్రమ కేసులు బనాయించిన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని వీరయ్య కోరారు. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వంద శాతం దృష్టిలోపం, మానసిక వికలాంగురాలైన మారేపల్లి గ్రామంలో ఆమె బెల్టుషాపులు, కిరాణాషాపులపై దాడి చేసిందనీ, ఇండ్ల గేట్లు విరగొట్టిందనీ, వ్యక్తులపై దాడి చేసిందంటూ అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.వారిపై వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.