Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో ప్రతిష్టాత్మకమైన నామినేటెడ్ ఆథారిటీలో డైరెక్టర్ (టెక్నికల్)గా డీజీఎం (మార్కెటింగ్)మారపల్లి వెంకటేశ్వర్లు ఎంపిక కావడం సింగరేణీయులకు గర్వకారణమని జీఎం (మార్కెటింగ్) కె.రవిశంకర్ అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన మౌఖిక పరీక్ష లో ఆయన విజయం సాధించారని తెలిపారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను జీఎం కె.రవిశంకర్ శనివారం సింగరేణి భవన్లో వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి బొగ్గు గని అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో రవిశంకర్ మాట్లాడుతూ.. మారపల్లి తన పట్టుదల, అకుంఠిత దీక్ష , మేధా శక్తితో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారని పేర్కొన్నారు.