Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన ఆరు విశ్వవిద్యాలయాల (ఓయూ, టీయూ, ఎంజీయూ, ఎస్‌యూ, పీయూ, కేయూ) ఉపకులపతుల (వీసీ)తో శనివారం వర్చువల్ పద్ధతిలో సమావేశం జరిగింది. అనంతరం ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీజీఈటీ తుదివిడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుందని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో డిగ్రీ ప్రథమ సెమిస్టర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సవరించామని వివరించారు. ఈనెల 17లోగా నిబంధనలు ఇవ్వాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ, సెలవులను 18 నుంచి 25 వరకు చేపట్టాలని కోరారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈనెల 28 నుంచి మార్చి 24 వరకు నిర్వహించాలని సూచించారు. ఈ పరీక్షలకు సంబంధించిన నిబంధనల్లో సెక్షన్ బీని తొలగిస్తున్నామని తెలిపారు.