Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు తెలంగాణ రైతుసంఘం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జోగులాంబ గద్వాల జిల్లా చిన్నోనిపల్లె ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మరెడ్డి ఇటీవల ఆ గ్రామాన్ని పరిశీలించారు. రైతులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పేర్కొంటూ శనివారం వారు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు అనుబంధంగా 2006లో గుమ్మిడిదొడ్డి, రేలంపాడు ప్రాజెక్టులను నిర్మించారని తెలిపారు.22టీిఎంసీలతో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడానికి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారని పేర్కొన్నారు. రేలంపాడు నుంచి 'గట్టు' మండలంలో చిన్నోనిపల్లె గ్రామంలో 1.5 టీఎంసీతో మరొక ప్రాజెక్టును నిర్మించేందుకు సర్కారు భూసేకరణ చేసిందని గుర్తు చేశారు. 'ఎకరాకు రూ 75-95 వేల చొప్పున ప్రభుత్వం సేకరించింది. ఆ ప్రాజెక్టు 80 శాతం పూర్తయింది. 2006లో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణ పనులను 2009లో నిలిపివేశారు. దీంతో భూములిచ్చిన రైతులు తమ భూమి సాగు చేసుకుంటున్నారు. నిర్మాణ పనులు జరగబోదని భావించిన చిన్నోనిపల్లె గ్రామ ప్రజలు గ్రామాన్ని అభివద్ధి చేసుకున్నారు.15ఏండ్లు తర్వాత తిరిగి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రకటించారు' అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆ గ్రామానికి రేలంపాడు ద్వారా నాలుగు కాలువల ద్వారా నీరు వస్తున్నదనీ,వాస్తవానికి చిన్నోనిపల్లె ప్రాజెక్టు నీటికి ఆయకట్టు లేదని తెలిపారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తే నాలుగైదువేల మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాసం కోసం సేకరించిన భూమిలో ఇండ్ల నిర్మాణంగానీ, ఇతరత్రా సౌకర్యాలుగానీ జరగలేదని పేర్కొన్నారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిన పరిసి ్థతుల్లో నిరాశ్రయులు వేరే చోటికి వెళ్లగలిగే స్థితిలో లేరని తెలిపారు. ఈ తరుణంలో తిరిగి అవస రం లేని ప్రాజెక్టును నిర్మాణాన్ని చేపడతామంటూ అధికారులు చెప్పడం తీవ్ర ఆందోళన కలిగిసు ్తన్నదని తెలిపారు.ఈ సమస్యను పునరాలోచించాలనీ,ప్రజల్లోని ఆందోళనను తగ్గించేందుకు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.