Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎస్‌జీసీసీఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల బదిలీల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు లెక్చరర్లకు వెంటనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు ల్చెరర్ల అసోసియేషన్ (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్‌లో టీఎస్‌జీసీసీఎల్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు బదిలీల అవకాశం కల్పించాలని కోరారు. 317 జీవో వల్ల రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల బదిలీలు ఇటీవల జరిగాయని వివరించారు. దీంతో కొందరు కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. 12 ఏండ్లుగా బదిలీల్లేక వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఇంత వరకు మార్గదర్శకాలు విడుదల కాలేదని పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకూ పరస్పర, స్పౌజ్ బదిలీలకు అవాశం కల్పించాలని కోరారు. ఈ అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌జీసీసీఎల్‌ఏ నాయకులు బైరి సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీఎస్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలి : ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
కాంట్రాక్టు అధ్యాపకులు 194(జే) పరిధిలోకి రాబోరని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసినందుకు ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ హర్షం ప్రకటించారు. టీడీఎస్‌ను రద్దు చేస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.