Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
మద్యానికి బానిసైన వ్యక్తి.. భార్యను డబ్బులు అడిగితే.. ఇవ్వనందుకు గొడ్డలితో భార్యను భర్త నరికి చంపాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపాడ్ గ్రామంలో జరిగింది. ఇన్చార్జి సీఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధర్మారపు రుద్రయ్య, విజయ రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. గతేడాది చిన్న కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి రుద్రయ్య మానసికంగా బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. సుమారు 6నెలల కింద రుద్రయ్య భార్యతో కలిసి హైదరాబాద్లోని నాగోల్లోని ఓ అపార్టుమెంట్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, ఆదివారం రుద్రయ్య అన్న వెంకన్న కూతురు శారీ ఫంక్షన్కు హాజరయ్యేందుకు గ్రామానికి చేరుకున్నారు. సుమారు 12గంటల ప్రాంతంలో మద్యం కోసం భార్య రాజేశ్వరిని డబ్బులు ఇవ్వమని అడగడంతో ఆమె లేవని చెప్పింది. దాంతో ఆగ్రహానికి గురైన రుద్రయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై నరికాడు. గమనించిన స్థానికులు వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి ఆమెను తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. మృతురాలి తల్లి మెతరి చంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.