Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, అదనపు అధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, జ్వర సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయనీ, అందులో భాగస్వాములైన సిబ్బందిని అభినందించారు.