Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారతరత్న అవార్డు గ్రహీత, ప్రఖ్యాత నేపథ్య గాయని లతామంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర సంతాపం తెలియజేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటలతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారనీ, ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటన్నారు. భారత దేశానికి ఆమె గాంధర్వ గానం అందిందనీ, భారతీయ సంగీతానికి ఆమె పెద్ద వరం అని సీఎం కొనియాడారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, తలసారి శ్రీనివాసయాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
సంగీత లోకానికి తీరని లోటు : రేవంత్‌రెడ్డి
లతా మంగేష్కర్ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంగీత లోకానికి తీరని లోటన్నారు. 30వేలకు పైగా హిందీ ఇతర భాషల్లో పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయరని కొనియాడారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ సీఎల్పీ నేత కె జానారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.