Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీపౖీె భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమతామూర్తి రామానుజ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ సభగా మార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా మోడీ సమానత్వంపై మాట్లాడటం సిగ్గుచేటని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రామానుజుల ఆలోచన విధానానికి పూర్తి విరుద్ధంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పారు. అందరూ సమానమేనని చాటి చెప్పే రామానుజుల వాదానికి భిన్నంగా బీజేపీ వ్యవహరించిందన్నారు. మిగతా పార్టీలను, అన్ని వర్గాల ప్రజలను అందులో భాగస్వామ్యం కాకుండా ఆ పార్టీ సభగా జరిపిందన్నారు. ఆ కార్యక్రమానికి మోడీ బీజేపీ అధ్యక్షుడిగా వచ్చారా? ప్రధాని హౌదాలో వచ్చారా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రధాన మంత్రి...అందరినీ సమానంగా చూడాలని కోరారు. కానీ మోడీ అందుకు భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. విభజించు, పాలించు అనే బీజేపీ ఆలోచన విధానాన్ని మరోసారి బయటపెట్టారనీ, దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలికే కార్యక్రమం నుంచి వీడ్కోలు పలికే వరకు మోడీ పర్యటన మొత్తం బీజేపీ కార్యక్రమంలా సాగిందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా ప్రధాని మోడీ విగ్రహ ప్రతిష్టాపన చేశారన్నారు. బీజేపీ మినహా మిగతా ఎవరూ రాకుండా భద్రత పేరిట ఎస్పీజీ అధికారులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని విమర్శించారు.