Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరిశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమయ పాలన, సహజతత్వం, సంస్కారానికి , మనిషిని ఒక మనిషిగా గుర్తించి, గౌరవించడంలో బొమ్మగాని ధర్మభిక్షం ఆదర్శప్రాయులనీ, ఆయన చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరిశంకర్ అన్నారు. పదవులు రాగానే నోటికొచ్చినట్టుగా, ఇష్టమొచ్చిన భాషలో మాట్లాడే వారు ధర్మభిక్షం నుంచి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని హితువు పలికారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజల మనిషి, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల సందర్భంగా ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సంయక్త ఆధ్వర్యంలో ''మహాసంకల్పం'' శతాధిక కవుల కవితా నీరాజనం పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ పుస్తకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఆవిష్కరించారు. పుస్తక సంకలనకర్త, అరసం రాష్ట్ర కార్యదర్శి కేవీఎల్ ఆహ్వానం పలికారు. అరసం కార్యనిర్వహక కార్యదర్శి పల్లేరు వీరస్వామి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండె చప్పుడే ధర్మభిక్షమన్నారు. త్యాగగుణం, తెగింపుతో కూడిన మానవత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు.తుది శ్వాస వరకు ఎర్రజెండా నీడలోనే ఉన్నారనీ,నిత్యం ప్రజల కోసం పరితపించే వారన్నా రు.ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడ ం,ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసేవార న్నారు.మట్టి మనుషులకు పోరాటం నేర్పిన మహౌన్నత వ్యక్తిత్వం అని అన్నారు. మహాసంక ల్పం పుస్తకం చదివితే ఆయన జీవితం మొత్తం అర్థమవుతుందన్నారు.
నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడ్డారని, క్రూర హింసకు గురయ్యారనీ, జైలులో పెడితే అక్కడా ఉద్యమాలు చేపట్టారని వివరించారు. ఈ నెల 15వ తేదీన రవీంద్రభారతిలో శతజయంతి సభను ఘనంగా నిర్వహించనున్నామని, దీనికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా,పలువురు మంత్రులు, ఇతర పార్టీల నాయకులు హాజరుకానున్నట్టు వెల్లడించా రు. ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ఒక అంశంపైన వంద మంది కవులు, రచయితలతో కూడిన పుస్తకం వచ్చిందనీ,కానీ ఒక రాజకీయ వ్యక్తిపైన వంద మంది కవులు,రచయితలతో స్మృతి కవితల మహా సంకల్పం లాంటి పుస్తకం రావటం చాలా అరుదన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్,తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్, ప్రజాగాయకు లు విమలక్క, సినిమా దర్శకులు బాబ్జీ,సినీ రచయిత మౌనశ్రీ మల్లిక్, తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ పాల్గొన్నారు.