Authorization
Sat April 05, 2025 09:16:15 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్నాటక రాష్ట్ర ఉడిపి జిల్లా భండార్కర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హిజాబ్ ధరించారనే పేరుతో ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించ కపోవడం దారుణమని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆవాజ్ మహిళా ఇన్చార్జ్ రఫత్ అంజుమ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, ఆవాజ్ మహిళా నాయకులు మోయిన్ బానో, షేక్ రిజ్వానా, సయీదా తన్వీర్ ఆలియాతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మరో రెండు నెలల్లో పరీక్షలున్నాయనీ, వారి చదువులు దెబ్బ తినే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ హక్కుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం ముస్లిం మైనార్టీ విద్యార్థినీల పట్ల వ్యవహరించిన తీరు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. విద్యాలయాలను మతం ఉద్రిక్తతలకు, విద్వేషాలకు కేంద్రంగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు. సంఫ్‌ు పరివార్ బలంగా ఉన్న మంగుళూరు, చికుమగులూరు, ఉడిపి జిల్లాల్లో ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల్లో ఇది ఐదవ ఘటనని గుర్తుచేశారు. బేటిబచావో, బేేటీ పడావో హితోక్తులు వల్లిస్తూనే..విద్యార్థినీలను చదువులకు దూరం చేయడం తగదన్నారు.