Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి షబ్బీర్ అలీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పునర్నిర్మాణమవుతున్న సచివాలయ ప్రాంగణంలో మసీదులు నిర్మించాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయ కూల్చివేత సమయంలో మసీదు నిర్మాణం కోసం ఆదేశాలి స్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారనీ, ఇప్పటికీ అందుకనుగుణంగా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మసీదులకు శంకుస్థాన చేసే సమయంలోనూ ఒక మతానికి చెందిన కొంత మందిని, రాజకీయ నాయకులను మాత్రమే ఆహ్వానించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా మసీదుల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.