Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకుల సంజయ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జిల్లాకు ఇద్దరు చొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 66 రెగ్యులర్ ఫార్మసీ ఇన్ స్పెక్టర్లను వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫార్మాసిస్టులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెంటనే కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి విజన్ అయిన ఆరోగ్య తెలంగాణ దిశగా పయనించాలని స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఇంఛార్జి ప్రెసిడెంట్ ప్రీతిమీనాకు సూచించారు.