Authorization
Sat April 05, 2025 08:58:44 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 2,387 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 68,720 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది.3,877 మంది డిశ్చార్జి అయ్యారు. 1,971 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,000 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 2,430 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 350 మందికి కరోనా సోకింది. మేడ్చల్ - మల్కాజిగిరిలో 105 మంది వ్యాధి బారిన పడ్డారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు రెండు శాతంగా నమోదయింది.