Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోటీ పరీక్షల్లో మైనార్టీ యువత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్లోని సంక్షేమభవన్లో సోమవారం జరిగిన సమావేశంలో మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి షఫీవుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడిందనీ, త్వరలో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ అవుతాయని చెప్పారు. పోటీ పరీక్షల్లో మైనార్టీ యువత మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు అధికారులు మరింత శ్రద్ధ వహించాలని కోరారు.