Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీ అంజనీకుమార్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన పబ్లిక్, ప్రయివేటు పార్టనర్ షిఫ్ (పీపీపీ) ప్రాజెక్టుల్లో ప్రభుత్వానికి రూ 234.70 కోట్ల పన్ను ఎగ్గొటిన ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఏసీబీ, విజిలెన్స్ డీజీ అంజనీకుమార్‌ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. స్నోవరల్డ్, హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్ఫో, జూబ్లీహాల్ కన్వెన్షన్ సెంటర్, జలవిహార్, సికింద్రాబాద్ గోల్ఫ్‌కోర్స్, ఐమాక్స్, పంటలోన్ రిటైల్ తదితర సంస్థలు ప్రభుత్వానికి రూ 234.70 కోట్ల పన్ను ఎగవేశాయని పేర్కొన్నారు. పేద రుణాలు చెల్లించకున్నా, ట్రాఫిక్ చలాన్లు కట్టకున్నా...వారిని ఎన్నో ఇబ్బందులకు గురి వసూలు చేస్తారనీ, ఆయా సంస్థల యాజమానులు కోట్లల్లో పన్నులు ఎగ్గొడుతున్నప్పటికీ ఏసీబీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.