Authorization
Sat April 05, 2025 04:55:02 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎంఐ) జాతీయ కార్యదర్శి, ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తండ్రి అచ్యుతుని శ్రీగణేష్ (65) కలకత్తాలో మరణించారు. కొంతకాలంగా ఆయన షుగర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు ప్రవీణ్, కూతరు ప్రవళిక ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్లోనూ, ఐటీ ఉద్యోగుల సమస్యల మీద పనిచేస్తున్నారు. ఆయన పార్థీవదేహాన్ని బరాసత్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆయన ఎస్బీఐలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.