Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడారంకు టీఎస్ఆర్టీసీ కొత్త సర్వీస్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మేడారం జాతరకు ప్రత్యక్షంగా వెళ్లి సమక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోలేని వారికోసం టీఎస్ఆర్టీసీ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. దేవాదాయశాఖతో కలిసి ఈ సేవల్ని నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మేడారంలో అమ్మవార్లకు 'బంగారం' (బెల్లం) మొక్కులు సమర్పించుకోవడం సంప్రదాయం, ఆనవాయితీ. నేరుగా జాతరకువెళ్ళలేని వారు టీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ కౌంటర్లలో బంగారాన్ని (బెల్లం) పార్సిల్ బుక్ చేస్తే, ఆర్టీసీ వారే ఆ మొక్కును నేరుగా సమక్క-సారక్క అమ్మవార్లకు సమర్పిస్తారు. టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. అమ్మ వారికి భక్తులు బంగారాన్ని సమర్పించి, ప్రసాదాన్ని కూడా తిరిగి ఆర్టీసీ వారే అందిస్తారని చెప్పారు. అన్ని బస్ స్టేషన్లతో పాటు ముఖ్య కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయనీ, 5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని వివరించారు. అది పంపిన భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మ వారి పసుపు కుంకుమ, ఫోటో కూడా అందజేస్తామని తెలిపారు. 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటాయి ఇతర వివరాలకు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-30102829, 040-68153333లతో పాటు షషష.్రత్ీష.్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.