Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేస్కేల్, పీఆర్సీ జీవో అమలు చేయాలి : రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ధర్నాలు
నవతెలంగాణ- విలేకరులు
వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పేస్కేల్, పీఆర్సీ జీఓను వెంటనే అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యాచరణ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు.అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబర్ 9న శాసన సభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఏలకు0 పేస్కేల్ ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు, మిర్యాలగూడ, నకిరేకల్, దామరచర్ల, హాలియా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. నాగర్‌కర్నూల్ మండల తాహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, తహసీల్దార్ ఆంజనేయులుకి వినతిపత్రం అందజేశారు.వికారాబాద్ జిల్లాలోని తాండూరులో సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు వీఆర్ఏలకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. అనంతరం అధికారికి వినతిపత్రం అందజేశారు. కోట్‌పల్లి, కొడంగల్, దోమ, మర్పల్లి, పెద్దేముల్ మండలాల్లో నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ వీఆర్ఏలకు మద్దతు తెలిపారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్‌లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ నాయకత్వంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బాసరలోనూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దిలావర్పూర్ లో దీక్షల్లో కూర్చున్నారు.తహసీల్దార్ హిమబిందుకు వినతిపత్రం అందజేశారు.భైంసా,సారంగాపూర్, ముధోల్ నూ దీక్షలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాండూర్‌లో ధర్నా చేపట్టారు.ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. నేలకొండపల్లిలో సీపీఐ(ఎం) నాయకులు సంఘీభావం తెలిపారు. బోనకల్లో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సీపీఐ(ఎం) నాయకులు సంఘీభావం తెలిపారు.