Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ చింతకాని
ప్రజా సమస్యలే అజెండాగా పనిచేసిన యలగొండ మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇటీవలే మరణించిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నాదెండ్ల యలగొండ కుటుంబాన్ని తమ్మినేని సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా సమస్యలే తన ఎజెండాగా యలగొండ పనిచేసేవారని గుర్తుచేశారు. తిమ్మినేనిపాలెం గ్రామం ఉన్నంత వరకు యలగొండ అభివృద్ధి కనిపిస్తుందన్నారు. కడవరకు ఆదర్శ కమ్యునిస్టుగా పనిచేసిన యలగొండ ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. యలగొండ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం జగన్నాధపురం గ్రామానికి చెందిన ఆలవాల నాగేశ్వరరావు కుమారుడు ఇటీవలే మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, తోటకూరి వెంకటనర్సయ్య, ఆలస్యం రవి ఉన్నారు.