Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడికక్కడే ఇద్దరు మృతి
- మరో ముగ్గురికి తీవ్రగాయాలు
- ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
లారీకి వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో జరిగింది. డీఎస్పీ మోహన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డీజిల్, పెట్రోల్ రవాణా చేసే ట్యాంకర్ వాల్ లీకయింది. దానికి వెల్డింగ్ చేయించేందుకు కొత్త బస్టాండ్ సమీపంలో గల మంత్రి అర్జున్(35) వెల్డింగ్ దుకాణం వద్దకు వెళ్లారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి ట్యాంకర్ పేలిపోయింది. వెల్డింగ్ చేస్తున్న మంత్రి అర్జున్‌తో పాటు ట్యాంకర్ డ్రైవర్ గట్టు అర్జున్(51) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ట్యాంకర్ డ్రైవర్లు మల్లేష్, వెంకటనారాయణ, రమణకు తీవ్రగాయాలయ్యాయి. మల్లేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. వెంకటరమణ, రమణను ఏరియాస్పత్రికి తరలించారు. వెల్డింగ్ వర్కర్ మంత్రి అర్జున్ పట్టణంలోని పాత మార్కెట్‌కు చెందిన వ్యక్తి. ఈయనకు కూతురు, కుమారుడు ఉన్నారు. మరో మృతుడు గట్టు అర్జున్ చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ట్యాంకర్ ఖాళీగానే ఉన్నప్పటికీ అందులో గ్యాస్ ఫామ్ కావడంతో వెల్డింగ్ చేస్తున్న సమయంలో వేడికి మంటలు అంటుకొని భారీ శబ్దంతో పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎస్పీ రాజేంద్రకుమార్, డీఎస్పీ మోహన్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.