Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్న కాంగ్రెస్,టీఆర్ఎస్ కార్యకర్తలు
- కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
నవ తెలంగాణ - అచ్చంపేట
భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున అచ్చంపేటకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచే పోలిసులు బందోబస్తు ఏర్పాటు చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీసులను దాటుకుని క్యాంప్ ఆఫీసుకు వచ్చిన ఆందోళనకారులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం నినాదాలు చేసుకుని.. రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల వారు స్వల్పంగా గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు రాజ్యాంగాన్ని అవమానపరడం దుర్మార్గపు చర్య అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో దళితుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గువ్వల జాతికి ద్రోహం చేస్తున్నారన్నారు.