Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌకర్యాల కోసం షేకుగూడవాసుల పోరు
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్రగా జిల్లా కేంద్రానికి..
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మనిషి బతకడానికి నీరు కనీస అవసరం. కానీ ఈ గ్రామస్తులకు మాత్రం తాగునీరు కూడా లభించని పరిస్థితి ఉంది. మురికినీరు తాగుతూ.. గొంతు తడారక..ఏండ్లుగా పడుతున్న కష్టాలను పరిష్కరించుకోవడమే మార్గమని భావించారు. ఊరంతా ఒక్కటై సీపీఐ(ఎం) అండగా.. రెండ్రోజులు పాదయాత్ర సాగించి సోమవారం కలెక్టరేట్‌కు కదిలొచ్చారు. వివరాలిలా ఉన్నాయి..ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గాదిగూడ మండలం, కుండి షేకుగూడ వాసులు నీటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారు. ఊరికి తాళం వేసి పిల్లాపాపలతో కలెక్టరేట్ బాట పట్టారు. గ్రామంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, రోడ్డు సౌకర్యం తదితర డిమాండ్లు పరిష్కరించాలని సీపీఐ(ఎం) నాయకుల అండతో రెండ్రోజుల పాటు పాదయాత్రగా వచ్చి సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు స్పందించి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు ఇక్కడే ఉండేందుకు అవసరమైన సరుకులు కూడా వెంట తెచ్చుకున్నారు. మంగళవారం నుంచి నిరవధిక దీక్షలకు దిగాలని నిర్ణయించారు.