Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెక్యూరిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిపాలన కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి, పోలీసుల అక్రమ అరెస్టులను భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడి చేసిన సెక్యూరిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాసెట్, ఎడ్సెట్, పీజీఈసెట్లో మిగిలిన సీట్లకు తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. అడ్మిషన్ల పేరుతో ప్రయివేటు కాలేజీలు దందా చేస్తున్నా ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు వారు పిలుపునిచ్చారు.