Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదుపాయాల లోటు ఉండొద్దు : యాదాద్రి సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మిగిలిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రిని సీఎం కేసీఆర్ సందర్శించారు. కొండచుట్టూ సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ సర్వే ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. అనంతరం సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. గతంలో నిర్దేశించుకొన్న పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయో.. లేదా.. అనే విషయాలపై ఆరా తీశారు. ఈ మేరకు గతంలో నిర్ధేశించుకొన్న పనులను పూర్తి చేయాలని సీఎస్ సోమేష్ ఆదేశించారు. ఆలయ అధికారులు, వేద పండితుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు. అతిథులకు సదుపాయాల ఏర్పాటులో ఎలాంటి లోటు ఉండొద్దని సీఎం చెప్పారు.కల్యాణ కట్ట, ప్రమాదాల తయారీ, కోనేరు ఏర్పాటు చిత్తశుద్ధితో ప్రారంభ సమయానికి చేయాలన్నారు. ఈ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రధానాలయం ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆటంకాలూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తిరిగి ఈనెల 12వ తేదీన వస్తానని సీఎం చెప్పారు. సీఎం వెంట మంత్రులు గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టేస్కాబ్ వైస్ చైర్మెన్, ఎన్డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉన్నారు.