Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 10 వరకు నిర్వహణ
- మార్చి 23 నుంచి ప్రాక్టికల్స్
- టైంటేబుల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు-2022 ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మే ఐదో తేదీ వరకు ప్రధాన పరీక్షలు, మే పదో తేదీ వరకు మిగిలిన పరీక్షలన్నీ పూర్తవుతాయి. కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే రెండు వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే ఐదో తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ జనరల్‌తోపాటు ఒకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తించనుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు ఇంటర్మీడియెట్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఇంటర్ పరీక్షల టైంటేబుల్‌ను సోమవారం విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 11న నైతికత, మానవ విలువలు రాతపరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 12న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల సిలబస్‌ను ఈనెల 28వ తేదీలోగా, థియరీ సిలబస్‌ను మార్చి చివరిలోగా పూర్తి చేయాలని కోరారు. విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి చేసేందుకు రోజువారీగా ప్రత్యేక తరగతులను తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇంటర్ పరీక్షల టైంటేబుల్
(ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు)
తేదీ మొదటి సంవత్సరం తేదీ ద్వితీయ సంవత్సరం
20.04.2022 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 21.04.2022 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
(బుధవారం) (గురువారం)
22.04.2022 ఇంగ్లీష్ పేపర్-1 23.04.2022 ఇంగ్లీష్ పేపర్-2
(శుక్రవారం) (శనివారం)
25.04.2022 మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, 26.04.2022 మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ,
(సోమవారం) బాటనీ పేపర్-1, (మంగళవారం) బాటనీ పేపర్-2,
పొలిటికల్‌సైన్స్ పేపర్-1 పొలిటికల్‌సైన్స్ పేపర్-2
27.04.2022 మ్యాథమెటిక్స్ పేపర్-1బి 28.04.2022 మ్యాథమెటిక్స్ పేపర్-2బి
(బుధవారం) జువాలజీ పేపర్-1 (గురువారం) జువాలజీ పేపర్-2
హిస్టరీ పేపర్-1 హిస్టరీ పేపర్-2
29.04.2022 ఫిజిక్స్ పేపర్-1 30.04.2022 ఫిజిక్స్ పేపర్-2
(శుక్రవారం) ఎకనామిక్స్ పేపర్-1 (శనివారం) ఎకనామిక్స్ పేపర్-2
02.05.2022 కెమిస్ట్రీ పేపర్-1 05.05.2022 కెమిస్ట్రీ పేపర్-2
(సోమవారం) కామర్స్ పేపర్-1 (గురువారం) కామర్స్ పేపర్-2
ఇతర పరీక్షలు
06.05.2022 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 07.05.2022 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2
(శుక్రవారం) బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 (శనివారం) బ్రిడ్జీ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2
(బైపీసీ విద్యార్థులకే) (బైపీసీ విద్యార్థులకే)
09.05.2022 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 10.05.2022 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2
(సోమవారం) జాగ్రఫీ పేపర్-1 (సోమవారం) జాగ్రఫీ పేపర్-2