Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్‌కు రేవంత్ ప్రశ్న
- మంత్రులు, ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోండి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న అక్రమనిర్మాణాల్లో మీ వాటా ఎంత? అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదా? నిలదీశారు. ఈమేరకు సోమవారం మంత్రి కేటీఆర్‌కు, రేవంత్ లేఖ రాశారు. అక్రమ కట్టడాలకు సంబంధించి పలు ఆధారాలను కూడా లేఖకు జత చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జా చేసి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అక్రమ కట్టడాలు కడుతున్నారని పేర్కొన్నారు. వారి అక్రమాలపై మీరెందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామంటూ అప్పుడప్పుడు అధికారులు హంగామా చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మీకు చేతగాకనా? లేక అందులో మీకు వాటాలున్నాయా? జవహర్‌నగర్‌లో 488 సర్వే నెంబర్లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యధేచ్చగా చేపట్టాలరనీ, అక్కడ ఆస్పత్రి కూడా నిర్మించారనీ, దాన్ని మరో మంత్రితో ప్రారంభోత్సవం చేయించారని గుర్తు చేశారు.
ఇది అంత ఆషామాషీ విషయమా? ఫీర్జాదిగూడలో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారని పేర్కొన్నారు. దేవరయాంజల్‌లోని 437సర్వే నెంబర్లో దేవాలయ భూమిని ఆక్రమించిన వారే, కొన్ని పత్రికలను నడుపుతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటని పరిగణనలోకి తీసుకుని వెంటనే ఆయా నిర్మాణాలను కూల్చివేయాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రత్యక్ష కార్యాచరణకు దిగుమతామని హెచ్చరించారు.