Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో సవరణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 317 రద్దు కోసం ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజరు మాట్లాడుతూ.. ఏస్థానికత కోసమైతే కొట్లాడి ప్రత్యేక రాష్ట్ర సాధించుకున్నామో దాని కోసం మళ్లీ ఆందోళనలు నిర్వహించాల్సి రావడం బాధాకరమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటానికి తమ సంఘీభావం ఉంటుందని తెలిపారు. 317 జీవోతో వారి కుటుంబాల్లో సీఎం చిచ్చుపెట్టారనీ, తద్వారా లక్షలాది మంది ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వాపోయారు.