Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం పురోగమిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో పరిశోధనలు జరుగుతున్నాయనీ, అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖలు, వ్యవసాయ యూనివర్సిటీలు, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌లో తెలంగాణ పత్తి పరిశోధనా కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలోనే నాణ్యమైన, అధిక దిగుబడులిచ్చే కంది పంట అభివద్ధి కోసం తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రాన్ని ప్రత్యేకంగా అభివద్ధి పరచాలని నిర్ణయించామన్నారు. పంట కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ, ఇతర కూరగాయల సాగుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలు, కార్పొరేషన్ల పరిధిలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి శాస్త్రీయ పద్దతుల్లో నాణ్యతను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని ఆదేశించారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు.