Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దురదష్టకరమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం విమర్శించారు. ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనంటూనే ఎప్పటికప్పుడు ఆ అంశంపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారనీ, బీజేపీ, ఆ పార్టీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే గతంలో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్ గల్లంతు చేసినట్టే రాబోయే రోజుల్లో అన్ని నియోజక వర్గాల్లో అదే భంగ పాటు తప్పదని హెచ్చరించారు. నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేస్తూనే ఉందని గుర్తు చేశారు. రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే ముందు విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.