Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసినట్టు సీపీజీఈటీ -2021 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనిద్వారా వర్సిటీ క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్, యూనివర్సిటీ డిస్ట్రిక్ట్ పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. దీనికోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమ వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు. నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఈనెల 12వ,తేదీన వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలన్నారు. సీట్ల కేటాయింపు తుది జాబితాను ఈనెల 14వ తేదీన విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత రెండ్రోజుల్లోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తాజా సమాచారం కోసం షషష.శీబaసఎఱరరఱశీఅర.షశీఎ, షషష.శీఎaఅఱa aష.ఱఅ వెబ్సైట్లో చూడాలని సూచించారు.