Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ప్రారంభమవుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన వారిలో మంత్రులు సత్యవతి రాథోడ్, అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి చైర్మెన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.