Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు జనగామ డీఐఈవో కార్యాలయం ముందు ధర్నా : టీఎస్‌జీసీసీఎల్‌ఏ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనగామ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకేషనల్ కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వస్కుల శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రీనివాస్ ఉద్యమిస్తున్నారని తెలిపారు. 2019లో కాంట్రాక్టు లెక్చరర్‌గా మారుస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. అందుకనుగుణంగా వేతనం ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. కానీ కాంట్రాక్టు లెక్చరర్ వేతనాల బిల్లులు చేయకుండా, వేరే వేతనాలు ఇవ్వడం వల్ల శ్రీనివాస్‌కు అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. డీఐఈవో సిబ్బందిని, ఇంటర్ విద్యా కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని ఆయన తీసుకెళ్లారని పేర్కొన్నారు. దీంతో ఆయనపై డీఐఈవో కక్ష పెంచుకున్నారని తెలిపారు. 317 జీవో ద్వారా రెగ్యులర్ లెక్చరర్ వచ్చినపుడు ఇద్దరు కాంట్రాక్టు అధ్యాపకులు ఒకే సబ్జెక్టులో పనిచేస్తున్నారనీ, శ్రీనివాస్‌కు ఇలా ఇబ్బంది కలగలేదని వివరించారు. ఇంటర్ విద్యా కమిషనర్ వివరణ ఉత్తర్వులు పాటించకుండా శ్రీనివాస్‌ను హాజరు రిజిస్టర్లో సంం చేయనివ్వకుండా ఇంఛార్జీ ప్రిన్సిపాల్ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని కోరుతూ గురువారం జనగామ డీఐఈవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.