Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు టీఎస్‌జీహెచ్‌ఎంఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్ (హెచ్ఎం)ల అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు మంగళవారం టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రంజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారం లేఖ రాశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన స్పౌజ్, ఇతర అప్పీళ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించిందని గుర్తు చేశారు. కానీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన స్పౌజ్, ఇతర అప్పీళ్లను ఇప్పటి వరకు పరిష్కరించలేదని తెలిపారు. భార్యాభర్తలు పనిచేసే జిల్లా, జోన్, మల్టీజోన్లు మారడం వల్ల వారు పనిచేసే ప్రదేశాల మధ్య చాలా దూరం పెరగడం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవనం, అతలాకుతలానికి లోనైందని వివరించారు. స్పౌజ్ కేటగిరీ ప్రకారం భార్యాభర్తలు వీలైనంత దగ్గరి పాఠశాలల్లో ఒకే జిల్లా, ఒకే మల్టీ జోన్లో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. మల్లీజోన్ స్థాయిలో వారి కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. కాబట్టి తమ అప్పీళ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు.