Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉత్తరాంచల్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ...ఆయా రాష్ట్రాల్లో ఎందుకు గెలవలేకపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందా? అని నిలదీశారు. మంగళవారం హైదరాబాద్లోని గాందీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశ ప్రజలు మోడీ చెప్పినట్టు చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగిస్తే కరోనా ఆగిందా? అని నిలదీశారు.పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకే మోడీ తపిస్తున్నారని విమర్శించారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిన చరిత్ర మోడీదని తెలిపారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య మోడీ చిచ్చు పెడుతున్నారని ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు.
బీజీపీ కార్యాలయ ముట్టడికి ఎన్ఎస్యూఐ యత్నం
తెలంగాణ రాష్ట్ర విభజనను తప్పు పడుతూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనంగా ఎన్ఎస్యూఐ ఆందోళన చేపట్టింది. మంగళవాం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయ ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకట్, నాయకులు హనుమాన్, గణేష్, సాయి, వినోద్చారి తదితరులు పాల్గొన్నారు.