Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరబాద్
మెడిసిన్ ప్రవేశ పరీక్షల్లో సీటు సాధించిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు. నీట్ ఫలితాల్లో 28 మంది విద్యార్థులకు గాను 15 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. మొదటి విడత కౌన్సిలింగ్లో ముగ్గురు విద్యార్థులు వైద్యవిద్యలో సీట్లు సాధించడం విద్యార్థుల కృషి, పట్టుదలకు నిదర్శనమన్నారు. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఏడాది ర్యాంకులు సాధించారనీ, మహాత్యా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. వచ్చే ఏడాది మరిన్ని ఎక్కువ ర్యాంకులు, సీట్లు బీసీ విద్యార్థులు సాధిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ర్యాంకులు వచ్చేందుకు కృషి చేసిన అధ్యాప కులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ ఏడాది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు ఎల్. వర్ష (534 మార్కులు) మమతా మెడికల్ కాలేజ్, ఖమ్మం, నిఖిల(474 మార్కులు) నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ , శ్రీకాంత్ (516 మార్కులు) సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఎల్. రాధమ్మ(429 మార్కులు), పి. యశ్ పాల్ (436 మార్కులు), వై. సౌజన్య(424 మార్కులు).