Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర విభజన చట్టానికి బీజేపీ సర్కారు తూట్లు పొడిచిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఇప్పుడేమో మోడీ, కేసీఆర్ ఇద్దరూ నాట కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హడావిడిగా ఏపీ విభ జన చేసిందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంగళవారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్లో భట్టి విలేకర్లతో మాట్లాడారు. ఆనాడు పార్లమెంటులో లేని మోడీ ఇప్పుడు రాష్ట్ర విభజనపై మాట్లాడటం సరైందికాదని తెలిపారు. అప్పుడు మోడీ లోక్సభలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు. రాజకీయంగా లబ్దిపొందేందుకే మోడీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.