Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణపై విషం చిమ్మేలా ప్రధాని వ్యాఖ్యలు : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అడ్డగోలుగా మాట్లాడటాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కోరారు. నల్లజెండాలు పట్టుకుని నిరసనలు తెలపాలని సూచించారు.