Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు నిందితుల అరెస్ట్
- రూ.4 లక్షలు, 3 కార్లు,11సెల్ఫోన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
చిట్యాల పోలీసులు 460 కేజీల గంజాయిని, ఏడుగురు నిందితులను పట్టుకున్నట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీష్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ తుర్కయంజాల్‌కు చెందిన గుడ్లారామ్ వెంకటనారాయణ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. టోలీచౌకికి చెందిన బాణోతు రమేష్ (పానిపూరి వ్యాపారం) వెంకటనారాయణకు పరిచయమయ్యారు. సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయించాలని, ఒక్క ప్యాకెట్ (2 కేజీల మీద) రూ. 500 కమీషన్ వస్తుందని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయమై బాణోతు రమేష్ అన్న బణోతు శాంతి కుమార్‌తో (నారాయణఖేడ్ నివాసి) మాట్లాడాడు. అతను వాళ్ల గ్రామ సర్పంచ్ అయిన ఆడే పుండలిక్ బాణోతు పుండలిక్, బాణోతు వెంకట్‌తో మాట్లాడాడు.