Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాలేజీలు, విద్యార్థులకు సంబంధించిన ఉపకారవేతనాల రిజిస్ట్రేషన్ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్టు షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి కారణంగా కాలేజీల్లో ప్రవేశాలు పూర్తి కాకపోవడంతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం ఇ-పాస్ వెబ్ సైట్లో నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ గడువును పొడిగించినట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.