Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే హైకోర్టు నిర్ణయం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొత్త జిల్లా కేంద్రాల్లోనూ జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై హైకోర్టు త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఇదే అంశంపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మినహా మిగిలిన అన్ని కొత్త జిల్లాల్లోనూ ఇప్పటికే అదనపు జిల్లా జడ్జి కోర్టులున్నాయని మంత్రి చెప్పారు. ఇక నుంచి వాటిని జిల్లా జడ్జి కోర్టులుగా మారుస్తామన్నారు. ప్రస్తుతమున్న కోర్టుల ప్రాంగణంలోనే వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.