Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆర్మూర్ టౌన్
ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ బాట పట్టిన వ్యక్తి.. అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై దుబారులోని తన రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన నూనె చంద్రయ్య (45) స్వర్ణకార వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగించారు. కాగా పనులు సక్రమంగా నడువలేక ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దాంతో కొన్నేండ్ల కిందట దుబారు వెళ్లాడు. వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం తాను ఉన్న రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరుపేద కుటుంబం, అద్దె ఇంట్లోనే జీవిస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు పాలకులు, అధికారులు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.