Authorization
Tue April 08, 2025 02:21:46 am
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనా థర్డ్ వేవ్ ముగిసిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ జనగామా జిల్లాకు వస్తున్నారనీ, గతంలో జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలు ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారనీ, అయినా ఇప్పటికీ వాటి ఊసేత్తలేదని విమర్శించారు. బుధవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి జీవో ఇచ్చిన తర్వాతనే జిల్లాకు రావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల అరాచకాలు అక్రమాలు, భూదందాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. వీటిపై సీఎం సమాధానం చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నారు. స్థానికేతరుడైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ ప్రజల పాలిట గుదిబండగా తయారయ్యారని విమర్శించారు. నామినేటెడ్ పోస్టులను మార్కెట్లో హోల్‌సేల్‌గా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దళితబందు గ్రామసభల ద్వారా జిల్లాలోని అర్హులందరికీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం కేేసీఆర్ రాకను అడ్డుకుని హామీలపై నిలదీస్తామని పేర్కొన్నారు.