Authorization
Tue April 08, 2025 08:54:45 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై బుధవారం చెన్న్తె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులను ఆపాలంటూ గత ఏడాది అక్టోబరు 29న ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేదంట ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ట్రిబ్యునల్ ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా చీఫ్ ఇంజినీర్ అండర్ టేకింగ్ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈనెల 14 లోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.