Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బ్రిటీష్ కౌన్సిల్ (యూకే)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గతం నుంచీ అమల్లో ఉన్న ఈ ఒప్పందాన్ని మరో మూడేండ్లపాటు కొనసాగిస్తూ, కొత్తగా ఒప్పంద పత్రాన్ని (ఎమ్ఓయూ) అధికారులు మార్చు కున్నారు. బుధవారంనాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగేకర్, బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ ఆండ్రూఫ్లెమింగ్, డైరెక్టర్ బ్రిటీష్ కౌన్సిల్ (సౌత్ ఇండియా) జనక పుష్పనాథన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. విద్య, కళలు, నూతన ఆవిష్కరణలు అంశాలపై పరస్పర అవగాహనా ఒప్పందాలు చేసుకున్నారు. 2018లో తెలంగాణ ప్రభుత్వం యూకేతో మూడేండ్ల కాలపరిమితికి ఒప్పందం చేసుకుంది. ఆ గడువు ముగియడంతో మరో మూడేండ్లకు అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఎమ్ఓయూ చేసుకున్నారు. దీనిపై ఇరు ప్రభుత్వాల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.