Authorization
Mon April 07, 2025 07:54:17 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపించిన ప్రధాని మోడీ సమతామూర్తి బోధనలు వినిపించడమంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర విభజనపై అక్కసు వెళ్ల్లగక్కిన మోడీ నిజస్వరూపం మరోసారి బయటపడిందన్నారు.బుధవారం హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆనాడు పార్లమెంట్లో లేని మోడీ ఇప్పుడు రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా ప్రధాని చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిన సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.