Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
లోన్‌యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పుణేకు చెందిన కుడోస్ ఫైనాన్స్ సంస్థ డైరెక్టర్ పవిత్ర ప్రదీప్ వాల్వెకర్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు, వ్యక్తిగత బాండ్ సమర్పించి బెయిల్ పొందాలనీ, ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి 1 గంట మధ్య ఈడీ దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలనీ, దర్యాప్తునకు సహకరించాలనీ, సాక్ష్యులను ప్రభావితం చేయరాదనీ, పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలనీ, దేశం విడిచి వెళ్లరాదన్తి న్యాయమూర్తి జస్టిస్ కె లలిత బుధవారం షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. పుణేకు చెందిన కుడోస్ సంస్థ లోన్‌యాప్ సంస్థ నిర్వాహకులకు సహకరించిందనీ, వేల కోట్ల వ్యాపారం చేసుకునేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిందని ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ మేరకు నిందితులను గతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.