Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా కమిషనర్ జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియెట్ సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని డీఐఈవోలు, నోడల్ అధికారులను ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని కోరారు. కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైందని పేర్కొన్నారు. దీంతో ఇంటర్ పరీక్షలను 70 శాతం సిలబస్‌తోనే నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. దీంతో ఆప్షనల్ సబ్జెక్టుల సిలబస్‌ను పూర్తిచేసేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు, నోడల్ అధికారులు ఈ దిశగా కృషి చేయాలని కోరారు.