Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రబడ్జెట్‌పై హెచ్‌సీయూ
ప్రొఫెసర్ ఆర్వి రమణమూర్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని హెచ్‌సీయూ అర్ధశాస్త్ర ఆచార్యులు ఆర్వి రమణమూర్తి అన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సార్వత్రిక సామాజిక వేదిక ఓపెన్ సోషల్ ఫోరమ్ కేంద్ర బడ్జెట్‌పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్‌కు ఆర్థిక రంగంతో సంబంధం లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పారు.
రైల్వే ట్యాక్స్ పెంచుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఆ రంగానికి బడ్జెట్లో అన్యాయం జరిగిందని అన్నారు. విద్యావైద్య రంగాలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు జరగలేదన్నారు. భారతీయుల వద్ద డిజిటల్ కరెన్సీ ఎంత ఉందో లెక్కించే ప్రయత్నం చేయకుండా దానిపై 30 శాతం ట్యాక్స్ వేస్తామనడం హాస్యాస్పదమని అన్నారు. సామాజిక శాస్త్రాల విభాగాల డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె కృష్ణారెడ్డి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.