Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి
- పీఆర్టీయూటీఎస్ 51వ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల సంక్షేమమే తమ ధ్యేయమని ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పీఆర్టీయూటీఎస్ 51వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌లోని నారాయణగూడలో జరిగాయి. సంఘం పతాకాన్ని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా 30 శాతం ఫిట్మెంట్, ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంపు, సీపీఎస్ ఉద్యోగులకు కుటుంబ పింఛన్, పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌తోపాటు 5,500 ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు వంటి జీవోలను సాధించామని చెప్పారు. 317 జీవో వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పౌజ్, జూనియర్ ఉపాధ్యాయుల సమస్యలను సీఎంతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, నాయకులు గుర్రం చెన్నకేశవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, గోవర్ధన్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.